Covid 19 Update: దేశంలో 498 కొత్త కేసులు నమోదు.. నలుగురు మృతి..!

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొత్తగా 498 కేసులు, నలుగురు మృతి. యాక్టివ్ కేసులు 5,364కి చేరినట్టు సమాచారం.

Update: 2025-06-06 07:21 GMT

Covid 19 Update: దేశంలో 498 కొత్త కేసులు నమోదు.. నలుగురు మృతి..!

Covid 19 Update: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం, దేశవ్యాప్తంగా కరోనా బారినపడిన వారి సంఖ్య 5,000 మార్కును దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 5,364గా ఉంది. ఈ వైరస్‌ నుంచి తాజాగా 4,724 మంది కోలుకున్నారని అధికారులు వెల్లడించారు. కాగా, ఇప్పటివరకు మొత్తం 55 మంది కరోనా వల్ల మరణించారని పేర్కొన్నారు.

గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 498 కరోనా కేసులు నమోదు కాగా, అదే సమయంలో నలుగురు మరణించారు. మృతులలో ఇద్దరు కేరళకు చెందినవారు కాగా, కర్ణాటక మరియు పంజాబ్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ప్రస్తుతం అత్యధిక యాక్టివ్ కేసులు కేరళలో ఉన్నాయి.

ప్రధాన రాష్ట్రాల్లో యాక్టివ్ కేసుల వివరాలు:

  • కేరళ – 1,679
  • గుజరాత్ – 615
  • పశ్చిమ బెంగాల్ – 596
  • మహారాష్ట్ర – 548
  • ఢిల్లీ – 562
  • కర్ణాటక – 451
  • తమిళనాడు – 221
  • ఉత్తరప్రదేశ్ – 205
  • రాజస్థాన్ – 107

తెలుగు రాష్ట్రాల్లోనూ కొవిడ్ కేసులు కనిపిస్తున్నప్పటికీ, అధికారికంగా రాష్ట్ర వారీగా పూర్తిగా లెక్కలు వెల్లడించలేదు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మాస్కులు ధరించడం, హైజీన్ పాటించడం, భౌతికదూరం పాటించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News