పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కరోనా పాజిటివ్ మహిళ..

భారత్ లో కరోనావైరస్ కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పటికే కేసుల సంఖ్య 20 వేలకు చేరింది. కేసులు , మరణాలు పెరుగుతున్న తరుణంలో మహారాష్ట్రలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

Update: 2020-04-22 03:00 GMT

భారత్ లో కరోనావైరస్ కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పటికే కేసుల సంఖ్య 20 వేలకు చేరింది. కేసులు , మరణాలు పెరుగుతున్న తరుణంలో మహారాష్ట్రలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.ముంబైలోని నానావతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 35 ఏళ్ల కరోనావైరస్ పాజిటివ్ మహిళ.. కరోనా లేని, ఆరోగ్యకరమైన శిశువుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం శిశువు ఆరోగ్యాంగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.. తల్లీబిడ్డ మధ్య ఎటువంటి సంబంధం లేకుండా వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రసూతి జరపడంతో తల్లికి సోకిన వైరస్ బిడ్డకు తగలలేదు.

ఈ పరిణామంతో కుటుంబసభ్యులు ఆనందపడాలో ,విచారించాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇటీవల సదరు గర్భిణీ మహిళ ప్రసూతి కోసం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు.. ఆమెకుకరోనా లక్షణాలు లేనప్పటికీ, ప్రసవానికి ముందు కోవిడ్ పరీక్షలు చేశారు.. అయితే ఏప్రిల్ 18 న ఆ మహిళకు పాజిటివ్ అని తేలింది.

ఈ క్రమంలో కరోనా పాజిటివ్ రోగులకు ప్రసూతి విభాగం ఆ ఆసుపత్రిలో లేనందున, మహిళను నానావతి ఆసుపత్రికి తరలించారు. తాజాగా ఆ మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శిశువు పూర్తిగా ఆరోగ్యంగా ఉందని వైద్యులు వెల్లడించారు.శిశువుకు మూడోరోజు లేదంటే ఎనిమిదవరోజు మరోసారి వైద్య పరీక్షలు చెయ్యాలని చెప్పారు.

ఇదిలావుంటే పుణెలోని 25 ఏళ్ల మహిళకు కూడా కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. ఆమె ఏప్రిల్ 16 న ఆసుపత్రిలో చేర్పించినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. అయితే ఆమె కూడా సోమవారం సాసూన్ ఆసుపత్రిలో అంటువ్యాధి లేని, ఆరోగ్యకరమైన మగబిడ్డకు జన్మనిచ్చింది.


Tags:    

Similar News