మహా రాష్ట్రలో కేసులకు తగ్గట్టు లేని ఐసీయూలు: ఆందోళనలో ప్రభుత్వం, అధికారులు

మహారాష్ట్రలో కరోనా కేసులు నానాటికీ విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే దానికి తగ్గట్టు ఐసీయూలు లేకపోవడంతో ఏం చేయాలనే దానిపై తలలు పట్టుకుంటున్నారు.

Update: 2020-06-14 04:52 GMT

మహారాష్ట్రలో కరోనా కేసులు నానాటికీ విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే దానికి తగ్గట్టు ఐసీయూలు లేకపోవడంతో ఏం చేయాలనే దానిపై తలలు పట్టుకుంటున్నారు. దేశంలోనే మూడో వంతు కేసులు ఇక్కడ నమోదు కావడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇలాంటి పరిస్థితిని అధికమించేందుకు ఇప్పటికే ఇంటి వద్దే వైద్యం విధానాన్ని ప్రకటించారు. అది ఎంతవరకు అమలవుతుందో వేచి చూడాల్సి ఉంది.

మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా మహారాష్ట్ర మొదటి స్థానంలో వుంది. ఈ క్రమంలో ముంబైలో కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో వైద్య మౌలిక సదుపాయాలపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా మూడు లక్షలకుపైగా కేసులు నమోదు కాగా, ఒక్క మహారాష్ట్రలోనే కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. అదే విధంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా కేసులు సంఖ్య 55,000 వేలకు చేరింది. ఇందులో 2,044 మంది మృత్యువాత పడ్డారు. గడిచిన 24 గంటల్లో 1,366 కొత్త కేసులు నమోదు కాగా.. 90 మంది కరోనా బాధితులు మరణించారు.

మహారాష్ట్రలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులతో ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్స్‌ సరిపోవడం లేదు. ముంబైలో దాదాపు 99 శాతం మేర ఐసీయూలు కరోనా బాధితులతో నిండిపోయాయి. అంతేగాక 94 శాతం వెంటిలేటర్లు ప్రస్తుతం వాడుకలో ఉన్నాయని అధికారులు తెలిపారు. జూన్‌ 11 నాటికి ముంబై నగరంలో ఐసీయూలో మొత్తం 1.181 పడకలు ఉంటే వాటిలో 1, 167 పడకలు ఇప్పటికే కరోనా బాధితులతో నిండిపోయాయి.. కేవలం 14 పడకలు మాత్రమే కొత్తగా చేరే పేషెంట్ల కోసం మిగిలి ఉన్నాయి. అలాగే 530 వెంటిలేటర్లలలో 497 ఉన్నాయి. 5,260 ఆక్సిజన్ పడకలలో 3,986 వాడుకలో ఉన్నట్లు బీఎంసీ తెలిపింది. కాగా నగరమంతా ఉన్న కోవిడ్ హాస్పిటల్స్‌, కోవిడ్ హెల్త్ సెంటర్లలలో 10,450 పడకలు ఉండగా, వీటిలో 9,098 పడకలు నిండిపోయాయి. అయితే కేసులు పెరుగుతన్నప్పటికీ అందుబాటులో ఉండే పడకల సంఖ్య కూడా పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు.

Tags:    

Similar News