Covaxin: భారత్‌లో చిన్నారులకు త్వరలో కొవాగ్జిన్

Covaxin:పిల్లల 'కొవాగ్జిన్' ట్రయల్స్ పూర్తి * 2, 3 దశల ట్రయల్స్ పూర్తి

Update: 2021-09-22 04:11 GMT

కావాక్సీన్ (ఫైల్ ఇమేజ్)

Covaxin: కరోనా తొలి, సెకండ్ వేవ్‌లు ప్రపంచాన్ని గడగడలాడించాయి. రెండో దశ ముగింపులో ఉన్నప్పటికీ ఇంకా భయాలు వీడలేదు. అక్కడక్కడ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా డెల్టా వేరియంట్లు భయపెడుతున్నాయి. ఇదే సమయంలో థర్డ్ వేవ్ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలపై థర్డ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉంటాయిన నిపుణులు చెప్పడంతో కలవరపెడుతోంది. అయితే భారత్ భయోటెక్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే చిన్నారులకు వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది.

పిల్లల కొవాగ్జిన్ టీకాపై రెండు, మూడు దశల క్లినికల్ పరీక్షలను భారత్ బయోటెక్ పూర్తి చేసింది. వచ్చే వారంలో క్లినికల్ పరీక్షల డేటాను DCGIకు సమర్పించనున్నట్లు భారత్ బయోటెక్ చైర్మన్, M.D. కృష్ణ ఎల్లా తెలిపారు. పిల్లలకు ఇచ్చే కొవాగ్జిన్ మాదిరిగానే ఉంటుదన్నారు. ఇక ఈ ట్రయల్స్ వెయ్యి మంది వాలంటీర్లపై జరిగినట్టు చెప్పారు. ముక్కు ద్వారా ఇచ్చే ఈ నాసికా వ్యాక్సిన్ ప్రయోగాలు వచ్చే నెల నాటికి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

వైరస్‌కు ప్రవేశ ద్వారమైన ముక్కులో వైరస్ నుంచి రక్షణ, వ్యాప్తి నిరోధకం, వైరస్ సోకకుండా ఉండేలా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని కృష్ణ ఎల్లా చెప్పారు. మూడు గ్రూపుల వారీగా ఈ ట్రయల్స్ జరుగుతున్నాయని వివరించారు. మొదటి గ్రూపు వారికి తొలిడోసుగా కొవాగ్జిన్ ఇచ్చి, రెండో డోసుగా ముక్కు ద్వారా తీసుకునే డోసు ఇస్తున్నామని తెలిపారు అదే విధంగా రెండో గ్రూపులో తొలి, రెండో డోసుకు ముక్కు ద్వారా అందిస్తున్నామని, మూడో గ్రూపులో ముక్కు ద్వారా తొలిడోసు, కొవాగ్జిన్‌ను రెండో డోసుగా ఇచ్చి పరీక్షిస్తున్నామని చెప్పారు. ఈ ప్రయోగాలను 650 వాలంటీర్లపై జరుపుతున్నామని, 28 రోజుల వ్యవధిలో రెండు డోసులు ఇస్తూ పరీక్షిస్తున్నామని కృష్ణ ఎల్లా వెల్లడించారు.

Full View


Tags:    

Similar News