భారత కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిలో కీలక ఘట్టం..

కరోనా కట్టడికోసం భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవాక్సిన్ కీలక దశకు చేరుకుంది..

Update: 2020-09-05 03:06 GMT

కరోనా కట్టడికోసం భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవాక్సిన్ కీలక దశకు చేరుకుంది. మొదటి దశ ట్రయల్స్ విజయవంతం కావడంతో రెండో దశ ట్రయల్స్ ను ప్రారంభించడానికి భారత్ బయోటెక్ ప్రభుత్వం అనుమతి పొందింది.భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న BBV152 కరోనావైరస్ వ్యాక్సిన్ లేదా కోవాక్సిన్ యొక్క రెండవ దశ క్లినికల్ ట్రయల్స్ 380 వాలంటీర్లపై నిర్వహించబడతాయని కేంద్ర ప్రభుత్వంలోని సెంట్రల్‌ డ్రగ్‌ స్టాండర్డ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌సీవో) స్పష్టం చేసింది.. ఇందులో పాల్గొనే వారందరికీ టీకా షాట్లు ఇచ్చిన తర్వాత నాలుగు రోజులు పరీక్షించవలసి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. రెండు మూడు రోజుల్లో దేశంలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో రెండో దశ పరీక్షలు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర వర్గాలు వెల్లడిస్తున్నాయి.

కాగా కోవాక్సిన్ యొక్క మొదటి దశ ట్రయల్స్ అంచనాల ప్రకారం సాగాయి, కోవిడ్-19 టీకా షాట్లను అందించిన వాలంటీర్లలో ఎటువంటి దుష్ప్రభావాలు కనపడలేదు. మొదటి దశలో, దేశవ్యాప్తంగా 375 మందికి కోవాక్సిన్ షాట్లు ఇచ్చారు. వీరంతా ఆరోగ్యాంగా ఉన్నారు. దాంతో కోవాక్సిన్ మొదటిదశ ట్రయల్స్ విజయవంతం అయ్యాయని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు భారత జాయింట్ డ్రగ్స్ కంట్రోలర్ డాక్టర్ ఎస్ ఈశ్వరరెడ్డి, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ కు జారీ చేసిన లేఖ రాశారు.. ఈశ్వరరెడ్డి రాసిన లేఖ ప్రకారం బిబివి 152 కోవాక్సిన్ యొక్క రెండవ దశ క్లినికల్ ట్రయల్స్ 380 వాలంటీర్లపై నిర్వహించబడతాయి అని పేర్కొన్నారు.  

Tags:    

Similar News