లాక్‌డౌన్ ముగిసే 6 రోజులు ముందు ప్రధాని సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్.. మళ్లీనా?
భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో మరోసారి మాట్లాడనున్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో మరోసారి మాట్లాడనున్నారు. ఏప్రిల్ 27వ తేదీ సోమవారం అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించనున్నారు. మే 3వ తేదీలాక్‌డౌన్ ముగియనున్న నేపథ్యంలో వారం రోజులు ముందు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుండడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అన్ని రాష్ట్రాల సీఎంలతో మోదీ ఇప్పటికే 3 సార్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మార్చి 20, ఏప్రిల్ 2, ఏప్రిల్ 11న ముఖ్యమంత్రులతో మాట్లాడి ఈ సారి కూడా లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించాలా? వద్దా? అనే దానిపైనా రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను తీసుకునే అవకాశముంది.
అలాగే కరోనా కట్టడి కోసం రాష్ట్రాలు ఇప్పటివరకు తీసుకున్న చర్యలు చేపట్టారు? కరోనా పరీక్షల సామర్ధ్యం అడిగి తెలుసుకొనున్నారు? ప్రధాని కరోనా కట్టడికి కేంద్రం వైపు నుంచి కీలక సూచనలు చేస్తూనే ఆయా.. రాష్ట్రాల నుంచి అభిప్రాయాలను స్వీకరించనున్నారు. దేశవ్యాప్తంగా బుధవారం సాయంత్రం వరకు కొత్తగా 1486 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో 20,471 కరోనా కేసులు నమోదయ్యాయి. 652మంది మరణించగా.. 9590 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 15,859 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో అత్యదికంగా 5,221 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా కేసులు పెరిగిపోయాయి. ఏపీలో 813 చేరుకున్నాయి. 24 మంది మృతి చెందారు.