తమిళనాడులో భారీగా పెరిగిన కేసులు.. ఒక్క రోజే 1562 కేసులు

Update: 2020-06-08 13:49 GMT
Representational Image

తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,562 పాజిటివ్ కేసులు, 17 మరణాలు సంభవించాయి. దీనితో తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 33,229కి చేరింది. ఇప్పటివరకు 286 మంది మరణించినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కరోనాతో పోరాడి రాష్ట్రంలో 17,527 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 15,413 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్సపొందుతున్నారు.

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 9,983 కేసులు నమోదు కాగా,206 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 2,56,611 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,25,381 ఉండగా, 1,24,094 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 7,135 మంది కరోనా వ్యాధితో మరణించారు. మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. గడచిన 24 గంటలలో నిర్వహించిన కరోనా టెస్ట్ ల సంఖ్య 1,08,048. దేశంలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా టెస్ట్ ల సంఖ్య 47,74,434.


Tags:    

Similar News