దేశంలో పెరుగుతున్న కేసులు.. ఆ టెస్టింగ్ కిట్స్ ఆపాలన్న ఐసీఎంఆర్

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పేరిగిపోతున్నాయి.

Update: 2020-04-21 13:23 GMT
Representational Image

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పేరిగిపోతున్నాయి. కేంద్రం ఆరోగ్యశాఖ వెల్లడించిన తాజా లెక్కల ప్రకారం 18,601కి చేరింది. గడిచిన 24 గంటల్లో 1331 కొత్త కేసులు నమోదైనట్టు తెలిపింది. ఈ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 3,252 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. సోమవరం ఒక్క రోజే 705 మంది కరోనా నుంచి కోలుకున్నారని ప్రకటించింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి శాతం 17.48కు చేరుకుందని తెలిపింది. కోవిడ్19 బారిన పడి 603 మంది మృతి చెందారు. ఇక ఇప్పటివరకు ఐసీఎంఆర్ తెలిపిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా 4,49,810 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించింది. నిన్న ఒక్క రోజే 35, 852 మందికి కరోనా టెస్టులు చేసినట్టు వివరించింది.

మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసులతో పాటు ఇతర వైద్య సదుపాయాలపై దృష్టి పెట్టాలని రాష్ట్రాలను ఆదేశించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. హెచ్ఐవీ, క్యాన్సర్, డయాలసిస్, పలు రకాల వ్యాధిగ్ర్తులక సైతం చికిత్స అందించాలని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ ఉపయోగిస్తున్నారు.

కరోనా పరీక్షల కోసం వినియోగిస్తున్న ఈ కిట్స్ రెండు రోజుల పాటు ఆపేయాలని ఐసీఎంఆర్ సూచించింది. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్‌పై కొన్ని సందేహాలు ఉన్న నేపథ్యంలో దీనిపై రెండు రోజులు నిలిపివేయాలని తెలిపింది. పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని, అప్పటివరకు కిట్స్ వాడకం ఆపాలని తెలిపింది. 

Tags:    

Similar News