దిల్లీలో కొత్తగా 990 కరోనా పాజిటివ్ కేసులు

దేశ రాజధాని దిల్లీలో ఇవాళ ఒక్కరోజే 990 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.

Update: 2020-06-01 14:58 GMT
Representational Image

దేశ రాజధాని దిల్లీలో ఇవాళ ఒక్కరోజే 990 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 20,834వేలు దాటింది. ఇప్పటి వరకు 523 మంది మరణించారు. కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా నేటి నుండి (జూలై 1) నుండి 30 వరకు లాక్ డౌన్ 5.0 విధించింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 990 కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20వేలు దాటింది.

భారత్ లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 8,392 కేసులు నమోదు కాగా, 230 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇండియాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,90,535కి చేరింది. మరో 93,322 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లోనే 5394 మంది కోలుకోవడం ఊరట కలిగిస్తోంది.


Tags:    

Similar News