భోపాల్ లో మరోసారి పెరిగిన కరోనావైరస్ కేసులు

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో 44 కొత్త కరోనావైరస్ కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు.

Update: 2020-06-01 15:43 GMT
Representational Image

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో 44 కొత్త కరోనావైరస్ కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. దీనితో, భోపాల్‌లో కరోనా సోకిన వారి సంఖ్య 1511 కు పెరిగింది, అయితే వీరిలో 964 మంది ఆరోగ్యంగా ఉన్నారని కూడా తెలిపింది. భోపాల్ లో ఇప్పటివరకు 59 మంది మరణించినట్లు జిల్లా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ప్రభాకర్ తివారీ విడుదల చేసిన బులెటిన్ తెలిపింది. ఇప్పుడు భోపాల్ లో 447 క్రియాశీల కేసులు మిగిలి ఉన్నాయి.

ఆదివారం హమీడియా ఆసుపత్రి నుంచి కోలుకొని 16 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాజధానిలో 170 ప్రాంతాల్లో కరోనా కేసులున్నాయి. భోపాల్ ఈ రోజు నుండి రైళ్లు పనిచేయడం ప్రారంభించాయి. భోపాల్ నుండి జాన్ శతాబ్ది ఎక్స్ ప్రెస్ , భోపాల్ ఎక్స్ ప్రెస్ అనే రెండు రైళ్లు నడుస్తున్నాయి.. మొదటి రైలు జాన్ శాతాబ్ది ఎక్స్ ప్రెస్ 456 మంది ప్రయాణికులను జబల్పూర్ నుండి భోపాల్ హబీబ్ గంజ్ స్టేషన్ కు తీసుకెళ్లింది.


Tags:    

Similar News