24 గంటల్లో.. మరో 13 మంది సిఐఎస్ఎఫ్ అధికారులు.. కోవిడ్ -19 కు పాజిటివ్ గా పరీక్షించాపబడ్డారు. దీంతో ఇప్పుడు మొత్తం 48 మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఉత్తరాఖండ్‌లో ఈ రోజు 4 కొత్త COVID-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి..
దాంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 67కి చేరిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. భారతదేశంలో ధృవీకరించబడిన COVID-19 కేసులు 59,662 గా ఉన్నాయి. అలాగే భారత్ లో కరోనా వ్యాప్తి ద్వారా మరణించిన వారి సంఖ్య 1,981 కు చేరింది. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీలో అత్యధిక కేసులు నమోదయ్యాయి.