Third Wave: దేశంలో కరోనా థర్డ్ వేవ్ కలకలం

Third Wave: ఆందోళన కలిగిస్తోన్న కొత్త కేసులు * కొత్త కేసులు 3 వారాల గరిష్ఠం

Update: 2021-07-31 03:32 GMT

Representational Image

Third Wave: దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న కొత్త కేసులు ధర్డ్ వేవ్‌ను తలపిస్తున్నాయి. మొదటి వేవ్‌లో తొలి కరోనా కేసు నమోదు అయి.. ఆ తర్వాత దాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొన్న కేరళలో థర్డ్ వేవ్ కలవరానికి గురి చేసింది. దేశ వ్యాప్తంగా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన సమయంలో.. కేరళలో కేసులు పెరిగాయి. దాంతో అప్రమత్తం అయిన కేరళ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కరోనాను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్ విధించింది.

కేరళకు తోడు కర్ణాటక.. తమిళనాడుతో పాటు మహారాష్ట్రలోనూ కొంత ఆందోళన కలిగిస్తోంది. దాంతో దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్న దేశ వ్యాప్తంగా 44 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 22 రోజుల్లో ఇవే అత్యధికమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటికే కేరళ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కర్ణాటకలో 19 రోజుల తర్వాత కేసులు 2వేలు దాటాయి. మహారాష్ట్రలో వారం రోజుల అత్యధిక సంఖ్య 7 వేలకు పైగా మందికి వైరస్ నిర్దారణ అయింది.. త మిళనాడులో మూడు రోజుల నుంచి బాధితుల సంఖ్య అధికం అవుతోంది. చెన్నై హా 20 జిల్లాల్లో కేసులు పెరుగుతున్నాయి. దీంతో చెన్నై, కన్యాకుమారి, కోయంబత్తూర్ సహా పలు జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.

కేరళలో కరోనా కేసులు పెరగడంతో.. సరిహద్దులను కర్ణాటక కట్టుదిట్టం చేస్తోంది. పొరుగు రాష్ట్రం నుంచి వచ్చేవారికి పరీక్షలు తప్పనిసరి చేసింది. బెంగళూరులో వారం రోజుల్లోనే కట్టడి ప్రాంతాలు 25శాతం పెరగడం వైరస్ వ్యాప్తి తీవ్రత తెలియజేస్తోంది. దేశంలో వరుసగా మూడో రోజు యాక్టివ్ కేసులు పెరిగాయి. కేరళలో జులై 1 నాటికి లక్ష యాక్టివ్ కేసులుండగా.. ఇప్పుడు లక్షన్నర దాటాయి.

ఇటు తెలంగాణ, ఏపీల్లో రెండు డెల్టాప్లస్ కేసులు నమోదు అయినట్టు కేంద్రమంత్రి జితేంద్రసింగ్ పార్లమెంట్‌లో తెలిపారు. దేశవ్యాప్తంగా 70 డెల్టా ప్లస్ కేసులు నమోదు అయినట్టు పేర్కొన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 23, మధ్యప్రదేశ్‌లో 11, తమిళనాడులో 10 డెల్టాప్లస్ నమోదైనట్టు వివరించారు. 

Tags:    

Similar News