Third Wave: కర్ణాటకను టెన్షన్ పెడుతున్న థర్డ్‌వేవ్

Third Wave: ఐదురోజుల వ్యవధిలో 242మంది చిన్నారులకు పాజిటివ్ * అప్రమత్తం అయిన కర్ణాటక అధికార యంత్రాంగం

Update: 2021-08-12 00:57 GMT

కేరళకు థర్డ్ వెవ్ టెన్షన్ (ఫైల్ ఇమేజ్)

Third Wave: దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్న వేళ కర్ణాటకలో థర్డ్‌వేవ్ టెన్షన్ పెడుతోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఐదురోజుల వ్యవధిలో 242మంది చిన్నారులు కోవిడ్ బారిన పడడం ఆందోళన రేపుతోంది. వీళ్లంతా 19 ఏళ్లలోపు వారే కావడంతో థర్డ్‌వేవ్ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోవిడ్ బారినప డిన వారిలో 9 ఏళ్లలోపు చిన్నారులు 106 మంది ఉండగా.. 9 నుంచి 19 ఏళ్ల వయసువారు 136 మంది ఉన్నారు.

మరోవైపు కొవిడ్ థర్డ్‌ వేవ్‌ వస్తే చిన్నారులపై అధిక ప్రభావం ఉంటుందని భావిస్తున్న తరుణంలో ఇలా తక్కువ వ్యవధిలో పెద్ద సంఖ్యలో చిన్నారులు కొవిడ్‌ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో కర్ణాటక అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. చిన్నారులను ఇళ్లలో ఉంచాలని తల్లిదండ్రులకు అధికారులు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News