Third Wave: ముంచుకొస్తున్న కరోనా థర్డ్ వేవ్

Third Wave: అక్టోబర్ లో థర్డ్ వేవ్ ముప్పు * కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే కరోనా ఆనవాళ్లున్నాయన్న ఐసీఎంఆర్

Update: 2021-09-01 03:00 GMT

Representational Image

Third Wave: కరోనా తన రూపు మార్చుకుంటూ విజృంభిస్తూనే ఉంది. అక్టోబర్‌లో కరోనా థర్డ్ వేవ్ ఉండే అవకాశం ఉందని ఐసీఎంఆర్ హెచ్చరించింది. సెకండ్ వేవ్‌లో కేసులు ఎక్కువగా నమోదు కాని రాష్ట్రాలకు థర్డ్ వేవ్ ముప్పు ఎక్కువగా ఉంటుందని ఐసీఎంఆర్ అంచనా వేసింది.. ప్రస్తుతం ఆ రాష్ట్రాల్లో ఇప్పటికే కేసులు పెరుగుతున్నాయని, థర్డ్ వేవ్ ఆనవాళ్లు కనిపిస్తున్నాయని అన్నారు. ఢిల్లీ, మహారాష్ట్రల్లో పరిస్థితతులను చూసిన తర్వాత చాలా రాష్ట్రాలు సెకండ్ వేవ్‌లో కఠినమైన ఆంక్షలను విధించాయని, వ్యాక్సినేషన్‌లో వేగం పెంచాయని ఐసీఎంఆర్ నిపుణులు డాక్టర్ సమీరన్ పాండా తెలిపారు..

సెకండ్ వేవ్‌లో కేసులు అంతగా నమోదు కాని రాష్ట్రాల్లో మూడో ముప్పుందని డాక్టర్ సమీరన్ పాండా స్పష్టం చేశారు. అలాగని మిగతా రాష్ట్రాలు నిర్లక్ష్యంగా ఉండొద్దని, ఇప్పుడు కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లోని పరిస్థితులను గమనిస్తూ చర్యలను తీసుకువాలని సూచించారు.. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో పరిస్థితులకు తగ్గట్టుగా థర్డ్ వేవ్ కు ముందుగానే ఏర్పా్ట్లు చేసుకోవాలన్నారు.. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే స్కూళ్లను తెరుస్తున్నారు. అయినా జాగ్రత్తలు అవసరంమని వెల్లడించారు..

ఇప్పటికే సగం మంది చిన్నారులకు కరోనా సోకినట్టు నాలుగో సీరో సర్వేలో తేలిందన్నారు. అయితే, స్కూళ్లు తెరవడం ప్రమాదమా, కాదా అన్న దానిపై చర్చలను పక్కన పెట్టాలని సూచించారు.. పిల్లల తల్లిదండ్రులు, టీచర్లు, స్కూల్ సిబ్బంది అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. కరోనా రూల్స్ ను తప్పకుండా పాటించాలన్నారు.

మరోవైపు.. కరనా వ్యాక్సినేషన్‌లో ఇండియా రికార్డు సృష్టించింది. మంగళవారం ఒక్కరోజే కోటి 30 లక్షల మందికిపైగా టీకాలు వేశారు.. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు.. ఈనెల 27న కోటీ 8 లక్షల మందికి పైగా టీకాలు పంపిణీ చేసిన ఇండియా.. ఐదు రోజుల్లోనే ఆ రికార్డును బ్రేక్ చేసింది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 65 కోట్ల మందికిపైగా టీకాలేసినట్టు కేంద్రం వెల్లడించింది. 

Tags:    

Similar News