Coronavirus: గాలి ద్వారానే కరోనా వైరస్ వ్యాప్తి

Coronavirus: ప్రముఖ మెడికల్ జనరల్ లాన్సెట్‌ అధ్యయనంలో సంచలన విషయాలు‌

Update: 2021-04-16 14:31 GMT

Representational Image

Coronavirus: కరోనా వ్యాప్తిపై ప్రముఖ మెడికల్ జనరల్ లాన్సెట్‌ సంచలన విషయాలను వెల్లడించింది. గాలి ద్వారానే కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతోందని ప్రకటించింది. గాలి ద్వారా వైరస్ సోకుతుందనడానికి తమ దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయని తెలిపింది. గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుందనే విషయాన్ని గుర్తించకపోవడం వల్లే ఎక్కువ మంది వైరస్ బారిన పడుతున్నట్లు లాన్సెట్ వెల్లడించింది. అమెరికా, బ్రిటన్, కెనడాకు చెందిన ఆరుగురు నిపుణులు తమ అధ్యయనంలో ఈ సంచలన విషయాలను గుర్తించారు.

గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందనే విషయాన్ని ప్రజలకు తెలియజేసి తగిన చర్యలు చేపట్టాలని లాన్సెట్ సూచించింది. ఇప్పటికైనా ప్రపంచ ఆరోగ్య సంస్థ తమ శాస్త్రీయ ఆధారాలను గుర్తించి గాలి ద్వారా వ్యాపించే వైరస్‌గా కరోనాను ప్రకటించాలని కోరింది.

కరోనా వైరస్ నియంత్రణకు ఇళ్లు, కార్యాలయాల్లో వెంటిలేషన్‌ మెరుగ్గా ఉండటంతోపాటు ఎయిర్‌ ఫిల్టరేషన్ సరిగా ఉండాల్సిన అవసరముందని లాన్సెట్ తెలిపింది. ఎక్కువ మంది గుడికూడినా, నాలుగు గోడల మధ్యే ఎక్కువసేపు గడిపినా వైరస్ త్వరగా అటాక్ అయ్యే అవకాశముందన్నారు. నిశ్శబ్ధ సంక్రమణం ద్వారానే అధిక శాతం మంది వైరస్ బారిన పడుతున్నారని లాన్సెట్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున కేసులు నమోదు కావడానికి ఈ నిశ్శబ్ధ సంక్రమణమే కారణమన్నారు. వేర్వేరు గదుల్లో ఉన్నా కరోనా రోగులతో నేరుగా ఎదురుపడకపోయినా వైరస్‌ సోకుతోందని చెబుతున్నారు.

ఇక, ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా కచ్చితంగా మాస్క్‌ ధరించాలని సూచించింది. అలాగే, కచ్చితంగా నాణ్యతా ప్రమాణాలున్న మాస్క్‌లనే వాడాలని లాన్సెట్ తెలిపింది. వైరస్‌ సంక్రమణ రేటు బయటి కంటే నాలుగు గోడల మధ్యే ఎక్కువగా ఉందని, ఒకవేళ వెంటిలేషన్ ఎక్కువగా ఉంటే కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చని వెల్లడించింది.

Full View


Tags:    

Similar News