రెండు వారాల పూర్తి లాక్ డౌన్ దిశగా మిజోరం..

Update: 2020-06-08 16:10 GMT

ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరిని వణికిస్తుంది కరోనా.. దీనిని అరికట్టడానికి ప్రపంచదేశాలు అన్ని లాక్ డౌన్ ని ప్రకటించాయి. ఇక భారత్ లో కూడా లాక్ డౌన్ ప్రకటించడం, పొడిగించడం కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వం మార్చ్ 24 నుండి ఏప్రిల్ 14 వరకు మొదటి విడత లాక్ డౌన్ డౌన్ ప్రకటించింది. తరువాత ఏప్రిల్ 15 నుండి మే 3 వరకు రెండొవ విడత లాక్ డౌన్ ప్రకటించింది.

కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో మరోసారి అంటే మే 3 నుండి మే 17 వరకు మూడవ విడత లాక్ డౌన్ అమలయ్యింది.. అయితే కొన్ని సడలింపులు ఐతే ఇచ్చింది. తరువాత మరోసారి మే 17 నుండి మే 31 వరకు మరోసారి నాల్గోవ విడత లాక్ డౌన్ ప్రకటించింది. అయినప్పటికీ కరోనా కేసులు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలలో అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి.. అయితే మరోసారి కేంద్ర ప్రభుత్వం ఐదో విడత లాక్ డౌన్ మాత్రం జూన్ 1 నుండి జూన్ 30 వరకు నెల రోజుల పాటు విధించింది.

కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా మిజోరం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 9నుండి రెండు వారలు పూర్తి లాక్ డౌన్ ను విధిస్తున్నట్టు ముఖ్యమంత్రి జొరాంతంగ తెలిపారు. అదే విధంగా ప్రస్తుతం 14 రోజులుగా ఉన్న క్వారంటైన్‌ సమయాన్ని 21 రోజులకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.


Tags:    

Similar News