Coronavirus on Jewellery: బంగారం పై కరోనా వైరస్?

Coronavirus on Jewellery: బంగారు ఆభరణాల పై కరోనా వైరస్ వుంటుంది. కానీ అది ఎంత కాలం వుంటుందో మాత్రం తేల్చలేకపోయారు.

Update: 2021-06-20 06:56 GMT

Corona Virus on Gold: (File Image)

Coronavirus on Jewellery: కరోనా...కరోనా అస్సలు ఆ పేరు వింటే భయం వేస్తుంది కదా. అంతలా ప్రభావితం చేసింది ఈ మహమ్మారి. కరోనా వైరస్ ప్రారంభంలో ఏఏ వస్తువులపై ఎంతెంత సేపు ఉంటుందో చాలా అధ్యయనాలే చేశారు నిపుణులు. కార్డుబోర్డు, స్టెయిన్‌లెస్ స్టీలు, ఇతర మెటల్ ఉపరితలాలపై వైరస్ సుదీర్ఘంగా జీవించే ఉంటుందని అధ్యయనాలు తేల్చాయి. దాంతో బంగారు నగలు వేసుకునేవారు... ఆ నగలపై కరోనా ఎంతసేపు ఉంటుంది అనే డౌట్ వచ్చి... అది ఎక్కువ కాలం జీవించి ఉంటే.. ఆ నగలపై పిల్లలు చేతులు వేస్తే... వారికి వైరస్ సోకితే ప్రమాదం అని భావిస్తూ... నగలు వాడటం, కొనడం మానేస్తున్నారు. ఆభరణాలతో పాటు ఇతర విలాసవంతమైన వస్తువులను ధరించేందుకు ప్రజలు ఆసక్తి చూపట్లేదు.

బంగారంపై వైరస్ ఎంత సమయం సజీవంగా ఉంటుందనే అంశంపై ఇంకా స్పష్టత లేదు.కాబట్టి నగలు వేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. కొంతమంది చేతులు కడిగేముందు బ్రాస్‌లెట్లు, ఉంగరాలు, ఇతర ఆభరణాలు తీసివేస్తారు. శుభ్రం చేసుకున్న తరువాత వాటిని మళ్లీ ధరిస్తారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదు. ఒకవేళ ఆభరణాలపై నిజంగా వైరస్ ఉంటే, మళ్లీ వాటిని ధరించినప్పుడు అది చేతులకు అంటుకుంటుంది. అందువల్ల ఉంగరాలు, బ్రాస్‌లెట్లు వంటి వాటిని తీసివేయకుండానే చేతులు శుభ్రం చేసుకోవడం మంచిది.

కొన్ని లోహాలతో తయారు చేసిన ఆభరణాలను సబ్బు, శానిటైజర్‌తో శుభ్రం చేస్తే పాడైపోతాయి. ఉదాహరణకు.. సబ్బు నీటితో కడిగితే వెండి దెబ్బతింటుంది. లేదా షైనింగ్ పోయి, వెండి ఆభరణాలు పాతవాటిలా కనిపిస్తాయి. అందువల్ల వీటిని శుభ్రం చేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన ఉత్పత్తులను ఎంచుకోవడం మంచిది.

బంగారు ఆభరణాలపై వైరస్ వుంటుంది. కానీ ఎంత సేపు ఉంటుందో మాత్రం నిపుణులు చెప్పలేకపోతున్నారు. ఏది ఏమైనప్పటి ప్రాణంతో సమానం బంగారం కాదు కదండి. సో ఆలోచించి మన జాగ్రత్తలో మనం ఉంటే సరిపోతుంది. అదే విధంగా కరోనా నుండి విముక్తి పొందాలంటే మాత్రం శరీరంలో ఇమ్యూనిటినీ పెంచుకోవడం ఒక్కటే మార్గం అని ఆరోగ్య నిపుణులు తేల్చేశారు.

Tags:    

Similar News