Coronavirus Updates: దేశంలో 16వేలు దాటిన కోవిడ్19 పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ పెరుగుతోంది. దేశంలో ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 16వేలు దాటింది.
దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ పెరుగుతోంది. దేశంలో ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 16వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో (ఆదివారం సాయంత్రం 5 గంటలకు) కొత్తగా 1,334 పాజిటివ్ కేసులు, 27 మరణాలు సంభవించాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా ఇప్పటి వరకు దేశంలో 519 మంది మృత్యువతపడ్డారు. పాజిటివ్ కేసుల సంఖ్య 16,116కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు ఈ వైరస్ బారి నుంచి 2301 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని తెలిపింది.
దేశం మొత్తంలో ఏడు రాష్ట్రాల్లో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బాధితుల సంఖ్య మహారాష్ట్రలో అంతకంతకూ పెరిగిపోతున్నాయి. మహారాష్ట్ర లో 3651 పాజిటివ్ కేసులు నమోదు కాగా 211 మరణాలు సంభవించాయి. కేసుల పరంగా రెండో స్థానంలో ఢిల్లీ ఉంది. ఇక్కడ 43 మంది మరణించారు. ఢిల్లీలో 1893 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లో 1604 కేసులు నమోదయ్యాయి. 58 మంది మృత్యువాత పడ్డారు. మధ్యప్రదేశ్‌లో 1407 మందికి పాజిటివ్ కేసులు రాగా.. 70 మంది మరణించారు. తమిళనాడులో 1372, రాజస్థాన్‌లో 1351, ఉత్తరప్రదేశ్ లో 1084 చొప్పున కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.