కేరళ మహిళను వదలని కరోనా.. 19 సార్లు కరోనా పాజిటివ్

కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించినప్పటికీ భారత్ లో మాత్రం కేసులు తగ్గడం లేదు..

Update: 2020-04-21 15:50 GMT
Representational Image

కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించినప్పటికీ భారత్ లో మాత్రం కేసులు తగ్గడం లేదు.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 18,601 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు కేంద్రం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 1336 కొత్త కేసులు నిర్ధారణ అయినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇక ఇది ఇలా ఉంటే కేరళలోని పత్తనంతిట్ట ప్రాంతానికి చెందిన 62 సంవత్సరాలు గల ఓ మహిళకి కరోనా సోకింది.

ఇటలీ నుంచి వచ్చిన కుటుంబ సభ్యుల కారణంగా ఆమెకు కరోనా సోకింది. దీనితో ఆమె మార్చి 10న ఆసుపత్రిలో చేరింది. 42 రోజులుగా చికిత్స అందిస్తున్నప్పటికి ఆమె ఆరోగ్య విషయంలో ఫలితం లేకుండా పోయింది. చికిత్సలో భాగంగా ఆ మహిళకు 19 సార్లు పరీక్ష చేయగా అన్నిసార్లు పాజిటివ్ అనే వచ్చింది. అయితే ఆమెకి 19 సార్లు పరీక్ష చేసినప్పటికి కరోనా లక్షణాలు ఆమెలో పెద్దగా బయటికి కనిపించడంలేదని వైద్యులు అంటున్నారు.

చికిత్సలో భాగంగా కాంబినేషన్ డ్రగ్స్‌ను మేము చాలాసార్లు ప్రయత్నించామని, పతనమిట్ట జిల్లా వైద్య అధికారి డాక్టర్ ఎన్ షీజా అన్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర వైద్య బోర్డు సలహా కోరినట్లు ఆమె తెలిపారు. పత్తనంతిట్ట జిల్లా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్.షీజా తెలిపారు. తదుపరి పరీక్షలోనూ కరోనా పాజిటివ్ వస్తే ఆమెను కొట్టాయం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలిస్తామని డాక్టర్ షీజా తెలిపారు.


Tags:    

Similar News