Coronavirus: భారతదేశంలో 800 మందికి పైగా మృతి

భారతదేశంలో మొత్తం కరోనావైరస్ కేసులు ఆదివారం 26000 మార్కును దాటాయి, దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో దాదాపు 2000 తాజా కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి.

Update: 2020-04-27 01:37 GMT
Representational Image

భారతదేశంలో మొత్తం కరోనావైరస్ కేసులు ఆదివారం 26000 మార్కును దాటాయి, దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో దాదాపు 2000 తాజా కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి.దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 26,917కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇక ఇప్పటివరకు మహమ్మారి భారిన పడి భారతదేశంలో 800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని 5,914 మంది దేశంలోని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

కాగా ఇప్పటివరకు మహారాష్ట్రలో అత్యధికంగా 7,628 కరోనా కేసులు నమోదు కాగా, 323 మంది మృతిచెందారు. ఆ తర్వాత గుజరాత్‌లో 3,071, ఢిల్లీలో 2,625, మధ్యప్రదేశ్‌లో 2,096 రాజస్తాన్‌లో 2,083, తమిళనాడు 1,821, ఉత్తరప్రదేశ్‌లో 1,843 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణాలో వేగంగా కేసులు నమోదు అవుతున్నాయి.


Tags:    

Similar News