Coronavirus: భారత్ లో కోలుకున్న వారి సంఖ్య చూస్తే..
భారత్ లో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. కేసుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది.
భారత్ లో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. కేసుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది.వైరస్ కారణంగా ఇప్పటివరకూ 53 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు 2,069 మందికి వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం తెలిపింది. వైరస్ బారిన పడ్డ వారిలో 155 మంది కోలుకున్నారని, వీరిలో కొందరు డిశ్చార్జ్ అయ్యారని.. దాంతో కోవిడ్–19 బాధితుల సంఖ్య ఇప్పుడు 1,860గా ఉందని ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇక రాష్ట్రాల వారీగా చూసుకుంటే అత్యధికంగా 335 కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదు కాగా, కేరళలో 265 , తమిళనాడులో 234 , తెలంగాణలో 154, ఢిల్లీలో 152, ఆంధ్రప్రదేశ్ లో 149 , ఉత్తరప్రదేశ్‌లో 113.
కర్ణాటకలో 110, రాజస్తాన్‌లో 108 మంది, మధ్యప్రదేశ్‌లో 99, గుజరాత్‌లో 82, జమ్మూ కశ్మీర్‌లో 62, వైరస్ బారిన పడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి. అలాగే పంజాబ్‌లో 46 కేసులు హరియాణాలోనూ 43, పశ్చిమ బెంగాల్‌లో 37, బిహార్‌లో 23, చండీగఢ్‌లో 16, లడాఖ్‌లో 13, అండమాన్ నికోబార్ దీవుల నుంచి 10, ఉత్తరాఖండ్‌లో 7, గోవాలో 5, ఒరిస్సాలో 4, పుదుచ్చేరి, హిమాచల్ ప్రదేశ్‌లలో 3 చొప్పున కోవిడ్19 కేసులు నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. జార్ఖండ్ 2, అస్సాం, మిజోరం, మణిపూర్‌లలో ఒక్కోటి చొప్పున కేసులు నమోదయ్యాయి.
ఇదిలావుంటే అధికారిక గణాంకాల ప్రకారం, భారతదేశంలోని వివిధ విమానాశ్రయాలలో 15 లక్షలకు పైగా ప్రజలు పరీక్షించబడ్డారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు మహమ్మారిగా ప్రకటించిన కరోనావైరస్ పై అన్ని ప్రశ్నలు మరియు సహాయం కోసం అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్ + 91-11-23978046 ను సంప్రదించమని ప్రజలను కోరింది.