Coronavirus: సీజనల్‌ వ్యాధుల లిస్టులో కరోనా!

Coronavirus: కరోనా సీజనల్‌ వ్యాధిగా మారే అవకాశం ఉందని గురువారం ఐక్యరాజ్య సమితి(ఐరాస) ఆందోళన వ్యక్తం చేసింది.

Update: 2021-03-18 07:23 GMT

కరోనా వైరస్ (ఫోటో: ఫైల్ ఇమేజ్)

Coronavirus: ప్రపంచ దేశాలను వణికిస్తోన్నకరోనా ఇపుడు సీజనల్ వ్యాధుల లిస్టులో చేరనుందా? అంటే అవుననే అంటోంది ఐక్య రాజ్య సమితి. ఈ మేరకు గురువారం ఒక ప్రకట విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం కొవిడ్-19 కొన్ని సంవత్సరాల పాటు సీజనల్‌ వ్యాధిగా మారే అవకాశం ఉందని గురువారం ఐక్యరాజ్య సమితి(ఐరాస) ఆందోళన వ్యక్తం చేసింది. వాతావరణ అంశాల ఆధారంగా కరోనా నిబంధనలకు సడలింపులు ఇవ్వొద్దని ప్రపంచదేశాలకు సూచించింది. కరోనా వ్యాప్తిపై వాతావరణ మార్పులు, గాలి నాణ్యత ప్రభావాలపై ఐరాస నిపుణుల బృందం అధ్యయనం చేసింది. దాని ఆధారంగానే ఐరాస ఈ హెచ్చరిక జారీ చేసింది.

తరచూ సీజనల్‌గా..

శ్వాసకోశ వైరల్ ఇన్ఫెక్షన్లు తరచూ సీజనల్‌గా మారతాయని శీతకాలంలో ఇన్‌ఫ్లూయెంజా విజృంభణ ఉంటుందని, సమశీతోష్ణ వాతావరణ పరిస్థితుల్లో జలుబు కలిగించే కరోనా వైరస్ వ్యాప్తి ఉంటుందని వెల్లడించింది. ఆయా ప్రభుత్వాలు విధించే నిబంధనలు మాత్రమే కోరాను నియంత్రించగలుగుతున్నాయి. మాస్కులు, ప్రయాణ ఆంక్షలు, లాక్‌డౌన్, కర్ఫ్యూ వంటి ప్రభుత్వ చర్యలు కరోనా వ్యాప్తిని దాదాపుగా కట్టడి చేస్తున్నాయి. అందువల్ల వాతావరణ అంశాల ఆధారంగా మాత్రమే ఆంక్షల సడలింపు దిశగా ప్రభుత్వాలు దృష్టి సారించలేవని నిపుణుల బృందం వెల్లడించింది.

వేడి వాతావరణంలోనూ విజృంభణ..

కొన్ని ప్రాంతాల్లో వేడి వాతావరణంలో కూడా ఈ మహమ్మారి విజృంభించిందని, రాబోయే సంవత్సరంలో ఇలాగే జరగదు అని చెప్పడానికి ఆధారాలు లేవని తెలిపింది. చల్లని, పొడి వాతావరణంలో, తక్కువ స్థాయిలో అతినీలలోహిత కిరణాల ప్రసారం ఉన్నప్పుడు వైరస్ ఎక్కువ కాలం మనుగడ సాగించినట్లు గుర్తించామని తెలిపారు. వైరస్ ప్రసారంపై వాతావరణ మార్పులు, గాలి నాణ్యత ఏ మేరకు ప్రభావం చూపుతాయన్నదానిపై స్పష్టత రావాల్సి ఉందని పేర్కొంది. మరోవైపు వాయు కాలుష్యం మరణాల రేటు పెంపునకు దోహదం చేస్తుందని, వైరస్ ప్రసారంపై మాత్రం నేరుగా ప్రభావం చూపటం లేదని పలు అధ్యయనాలు ప్రాథమికంగా వెల్లడిచేస్తున్నాయి. 

Tags:    

Similar News