కరోనా వాక్సిన్‌పై సీరం ఇన్స్‌స్టిట్యూట్‌ కీలక ప్రకటన

Update: 2020-11-20 13:28 GMT

కరోనా వ్యాక్సిన్‌ లభ్యత, ధరపై దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తరుణంలో సీరం ఇన్స్‌స్టిట్యూట్‌ కీలక విషయాన్ని ప్రకటించింది. 2021 ఏప్రిల్‌ నుంచి సాధారణ ప్రజలకు కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది. ఈ మేరకు సీరం సీఈఓ అదర్‌ పూనావాలా ఓ ప్రకటన విడుదల చేశారు. తాము ఉత్పత్తి చేస్తున్న కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ ధర 1000 రూపాయల వరకు ఉంటుందని పేర్కొన్నారు. రెండు డోసుల తమ వ్యాక్సిన్‌ను సుమారు వెయ్యి రూపాయలకు అందిస్తామని వివరించారు.

ఫలితాలు, నియంత్రణ ఆవెూదాలను బట్టి 2021 ఫిబ్రవరి లోపు హెల్త్‌ కేర్‌ సిబ్బందికి, వృద్దులకు కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటుందన్నారు. అలాగే ఏప్రిల్‌ నాటికి సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండనుందని పూనావాలా ఆ ప్రకటనలో వివరించారు. ఫిబ్రవరి నుంచి నెలకు సుమారు 10 కోట్ల వెూతాదులను తయారు చేయాలని ఎస్‌ఐఐ యోచిస్తోందని పూనావాలా చెప్పారు. 2024 నాటికి దేశంలో అందరికి కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటుందన్నారు.

Tags:    

Similar News