దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ విజయవంతం..తొలి రోజే భారీ సంఖ్యలో..

*16,755 మంది వ్యాక్సినేటర్లు విధులు నిర్వహించారు: కేంద్ర ఆరోగ్యశాఖ *కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లను ఉపయోగించాం: కేంద్ర ఆరోగ్యశాఖ

Update: 2021-01-16 14:31 GMT

కరోనా వ్యాక్సినేషన్ 

దేశవ్యాప్తంగా తొలివిడత కరోనా వ్యాక్నినేషన్ విజయవంతంగా జరిగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తొలిరోజు 1.65 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ అందించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. తొలి దశలో మూడు కోట్ల మందికి వ్యాక్సిన్ అందించడమే టార్గెట్‌ అని, ఇవాళ టీకా వేయించుకున్న ప్రజలకు ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్ రాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. తొలి రోజు లక్షా 65 వేల 714 మందికి వ్యాక్సిన్ అందించినట్లు తెలిపిన కేంద్ర ఆరోగ్యశాఖ.. ఈ కార్యక్రమంలో 16 వేల 755 మంది వ్యాక్సినేటర్లు విధులు నిర్వహించారని, కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు ఉపయోగించినట్లు తెలిపింది.

 

Tags:    

Similar News