Corona Virus: సెకండ్‌ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కరోనా వైరస్

Corona Virus: దేశంలోని 5 రాష్ట్రాల్లో వైరస్‌ విజృంభణ * మహారాష్ట్రలో రోజుకు 6వేలకు పైగా కొత్త కేసులు

Update: 2021-02-23 03:31 GMT

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

Corona Virus: అంతా అయిపోయింది. అదుపులోకి వచ్చేసింది. ఇక డోన్ట్‌ ఫీకర్‌ అని సంబురపడ్డాం. కానీ కనిపించని భూతం మళ్లీ విజృంభిస్తోంది. పెరుగుతున్న కరోనా కేసులు దేశ ప్రజలను వణికిస్తున్నాయి. దేశమంతట వ్యాక్సినేషన్‌ జరుగుతోంది. కానీ వైరస్‌ ఇదేమీ పట్టనట్టు దాని పని అది చేసుకుంటూ పోతోంది. 5 రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ సెకండ్‌ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. వైరస్‌ మళ్లీ ఫాంలోకి వచ్చిందా ప్రజల నిర్లక్ష్యమే ఇందుకు కారణమా

కరోనా అంటే భయం పోయింది. నిబంధనలను గాలికి వదిలేశారు. మాస్క్‌లను పెట్టుకోవడం మరిచిపోయారు. సోషల్‌ డిస్టెన్స్ అనే పదమే వినిపించడం లేదు. ఇంకేముంది. కరోనా మళ్లీ జడలు విచ్చుకుంది. జెట్‌ స్పీడులా దూసుకువెళ్తోంది. వైరస్‌ దూకుడుకు కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.

మహారాష్ట్రలో కరోనా వైరస్‌ సెకండ్‌ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. పెరుగుతున్న కేసులు ఆ రాష్ట్ర ప్రజలను వణికిస్తున్నాయి. రోజుకు 6వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఒక్క ముంబైలోనే రోజుకు రెండు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.

బీఎంసీ అధికారులు ఎలెర్ట్ అయ్యారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి క్వారంటైన్‌ తప్పనిసరి చేశారు. అమరావతి, యవాత్మల్, ముంబైలో అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. లోకల్ ట్రెయిన్స్‌ ప్రారంభించాకే కేసులు పెరగడంతో నివారణ చర్యలు చేపడుతున్నారు.

కేరళలోనూ అదే పరిస్థితి. రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 10 లక్షల మార్క్‌ను క్రాస్‌ చేసింది. కేరళ ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.

దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ జరుగుతోంది. ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ వ్యాక్సిన్‌ తీసుకుంటున్నారు. ఇక జనాలందరు కొవిడ్‌ నిబంధనలను లైట్‌ తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ కేసుల సంఖ్య చూసి బెంబెలెత్తిపోతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైనా జనాలు కోవిడ్‌ రూల్స్‌ని తూచా తప్పకుండా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News