Omicron: దేశంలో మళ్లీ మొదలైన కరోనా ఫియర్..నిర్లక్ష్యం వహిస్తున్న జనం

*కొవిడ్ వ్యాప్తికి అడ్డాలుగా మారుతున్న మార్కెట్లు *బహిరంగ ప్రదేశాల్లో నిబంధనలు పాటించాలని వెల్లడి

Update: 2021-12-14 04:15 GMT

దేశంలో మళ్లీ మొదలైన కరోనా ఫియర్

Omicron in India: దేశంలో కరోనా విజృంభణ మళ్లీ మొదలైంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దూసుకు వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు, నిపుణులు ఎంత హెచ్చరించినా ప్రజల్లో మాత్రం మార్పు లేదు. కొవిడ్ నిబంధనలను గాలికి వదలి రద్దీ ప్రాంతాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

ఒమిక్రాన్ వైరస్ ఉనికితో ఓ పక్క జనం వణుకుతుంటే కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తుంది. నగరంలోని ప్రధాన మార్కెట్లు, షాపింగ్ మాల్స్, విద్యా సంస్థలు, టిఫిన్ సెంటర్లు వంటి చోట రద్దీ అత్యధికంగా కనిపిస్తుంది. కనీసం భౌతికదూరం, మాస్క్ వంటి కనీస నిబంధనలు కూడా పాటించకుండా మార్కెట్లన్ని నిత్యం జన సందడిగా మారాయి. ఇప్పుడు ఇవే కొవిడ్ హాట్ స్పాట్‌లుగా మారే ప్రమాదమూ ఉందంటున్నారు నిపుణులు.

ఇక ఫిబ్రవరిలో థర్డ్ వేవ్ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఓ వైపు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక వచ్చే వారంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 3 వందలు దాటితే రాత్రి కర్ఫ్యూ విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి షాపు వద్ద కరోనా నిబంధనలు పాటించేలా బోర్డులు, ప్రధాన ద్వారం వద్ద శానిటైజర్ వాడకం వంటి రూల్స్ పెట్టినా వాటి అమలు కఠినతరం చేయకపోవడమే ఇందుకు కారణమంటున్నారు కొందరు. అందరూ వాటిని ఖచ్చితంగా పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని నగర వాసులు కోరుతున్నారు. మరోవైపు నిబంధనలు ఉల్లంఘిస్తే వెయ్యి జరిమానాలు విధిస్తామని హెచ్చరిస్తున్నా ప్రజల్లో మార్పు కనిపించడం లేదని అధికారులంటున్నారు.

Tags:    

Similar News