భారత్‌కు కరోనా ఫోర్త్‌వేవ్‌ ముప్పు

Corona: కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ హెచ్చరిక

Update: 2022-12-21 03:42 GMT

భారత్‌కు కరోనా ఫోర్త్‌వేవ్‌ ముప్పు

Corona: ప్రపంచంలోని అనేక దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో కేంద్రం అలెర్ట్ అయింది. చైనా, జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్, అమెరికా దేశాల్లో కేసులు విపరీతంగా పెరగడంతో..మనదేశంలో నమోదవుతున్న కరోనా కేసులకు సంబంధించి రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక సూచన చేసింది. వైరస్ కొత్త వేరియంట్‌లను ఎప్పటికప్పుడు గుర్తించాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. పాజిటీవ్ నమూనాల పూర్తి జన్యు క్రమాన్ని విశ్లేషించాలని సూచించారు. దీని కోసం ప్రతీ రోజు కోవిడ్ పాజిటివ్‌గా తేలిన నమూనాలను లేబోరేటరీలకు పంపించాలని కోరారు. మరోవైపు..అంతర్జాతీయంగా తాజా పరిస్థితులను అంచనా వేసేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ ఇవాళ ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

Tags:    

Similar News