డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న కరోనా.. రోజు రోజుకు పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు

Coronavirus: *24 గంటల్లో 13,216 కేసులు *ఒక్క రోజులోనే 24 మంది మృతి

Update: 2022-06-18 11:04 GMT

డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న కరోనా.. రోజు రోజుకు పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు

Coronavirus: కరోనా ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ప్రపంచ దేశాలు కోవిడ్‌ నియమాలను తొలగిస్తుంటే మన దేశంలో మాత్రం కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. 24 గంటల్లో 13వేలకు పైగా కొత్త కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. ఒక్క రోజులోనే 23 మంది మృతి చెందడం యాక్టివ్‌ కేసుల సంఖ్య 68వేలకు పెరగడంతో ఫోర్త్‌ వేవ్‌ తప్పదా? అనే భయాందోళనలు నెలకొన్నాయి. నాలుగు నెలల తరువాత తొలిసారి 13వేల 216 కేసులు నమోదయ్యాయి. నిన్న 8వేలకు పైగా కేసులు నమోదవగా ఒక్క రోజులోనే 5వేల కేసుల పెరిగాయి. ఇందులో అత్యధికంగా మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీలోనే నమోదవుతున్నాయి.

తాజాగా 13వేల 216 కేసుల్లో 70 శాతం కేసులు మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీలో నమోదయినవే ఉన్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 4వేల 165 కేసులు నమోదయ్యాయి. ఇక కేరళలో 3వేల 162, ఢిల్లీలో 17 వందల 92 కేసులు, హర్యానాలో 689, కర్ణాటకలో 634, తమిళనాడు 589, ఉత్తర ప్రదేశ్‌లో 461, పశ్చిమ బెంగాల్‌ 295, గుజరాత్‌లో 225 కేసులు నమోదయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు నమోదువుతున్నాయి. తెలంగాణలో 279, ఏపీలో 46 నమోదయ్యాయి. తాజా కేసులు పెరుగుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే కరోనాను ఎదుర్కొనవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కేసుల సంఖ్య పెరుగుతున్నా ఆసుపత్రిలో చేరికలు లేవని భయాందోళన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.

Tags:    

Similar News