Karnataka: కర్ణాటక వెళ్తే ఆర్టీపీసీఆర్ నెగెటివ్ తప్పనిసరి..!?

* కరోనా కట్టడికి కఠిన ఆంక్షలు * రాష్ట్రాల సరిహద్దుల్లో టెస్టులు ముమ్మరం * కేరళ నుంచి వచ్చే వారికి నెగెటివ్ తప్పనిసరి

Update: 2021-08-01 03:57 GMT

కర్ణాటక వెళ్తే ఆర్టీపీసీఆర్ నెగెటివ్ తప్పనిసరి (ఫైల్ ఫోటో)

Karnataka: కేరళ, మహారాష్ట్రల్లో కరోనా కేసులు పెరుగుదల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రెండురాష్ట్రాల నుంచి కర్ణాటకకు వచ్చే ప్రయాణీకులకు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేసింది. టీకాలతో సంబంధం లేకుండా 72 గంటల్లోపు తీసుకున్న రిపోర్టును సమర్పించాలని స్పష్టం చేసింది. విమానాలు, బస్సులు, రైళ్లు, వ్యక్తిగత వాహనాలు ద్వారా వచ్చే ప్రయాణీకులందరికీ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేసింది.

కేరళ, మహారాష్ట్రల్లో ప్రారంభమయ్యే అన్ని విమానాలకు వర్తిస్తుందని, 72 గంటలకు మించకుండా ఉన్నఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికేట్ ఉన్న ప్రయాణికులకే విమానాల్లో అనుమతి ఇస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి విస్తృతంగా టెస్టులు చేస్తోంది. దక్షిణ కన్నడ, కొడుగు, మైసూర్, బెళగావి, విజయపుర, కాలబురిగి, బీదర్ డిప్యూటీ కమిషనర్లు కర్ణాటకలో ప్రవేశించే వాహనాలను చెక్ పోస్టుల వద్ద తనిఖీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

Tags:    

Similar News