దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న యాక్టివ్ కేసులు.. అధిక ఛార్జీలు వసూలు చేస్తే...

Corona Cases in India: అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం లేఖ...

Update: 2022-01-11 04:00 GMT

దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న యాక్టివ్ కేసులు.. అధిక ఛార్జీలు వసూలు చేస్తే...

Corona Cases in India: దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజురోజుకు లక్షల కేసులు నమోదవుతున్నాయి. అయితే ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య గణనీయంగా తగ్గిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషన్ తెలిపారు. కరోనా సెకండ్ వేవ్‌లో దేశంలో 20 నుంచి 23 శాతం మంది రోగులు ఆస్పత్రుల్లో చేరితే, ఇప్పుడు మూడో దశలో ఆ సంఖ్య 5 నుంచి 10 శాతానికే పరిమితమైందని వెల్లడించారు. అయితే పరిస్థితిలో మార్పువస్తే ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య పెరిగే అవకాశముందని హెచ్చరించారు. అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శులకు లేఖలు రాశారు.

అవసరమైతే కొవిడ్‌ సేవల నిమిత్తం వైద్య విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలని ఇదివరకే మార్గదర్శకాలు జారీచేశామని తెలిపారు. ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య రెండోవేవ్‌ కంటే ప్రస్తుతం తక్కువగానే ఉందని చెప్పారు. కానీ, ఏ క్షణమైనా పరిస్థితుల్లో వేగంగా మార్పు రావచ్చని, యాక్టివ్ కేసులు, హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు, ఆసుపత్రుల్లో చేరినవారు, ఆక్సిజన్‌ పడకలు, ఐసీయూలు, వెంటిలేటర్ల మీద ఉన్నవారి సంఖ్యను నిత్యం గమనించాలని చెప్పారు. దాని ఆధారంగా వైద్యఆరోగ్య సిబ్బంది, వసతులను సమకూర్చుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు.

ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్‌ సేవల కోసం ప్రత్యేకంగా పడకలు కేటాయించాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషన్ చెప్పారు. ఎక్కడైనా అధిక ఛార్జీలు వసూలు చేస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ అంశాన్ని పరీక్షించడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ పడకలను అవసరమైతే ఆక్సిజన్‌ పడకలుగా మార్చాలని, టెలి-మెడిసిన్‌ సేవలు అందించడానికి రిటైర్డ్‌ వైద్య సిబ్బంది, ఎంబీబీఎస్‌ విద్యార్థులను ఉపయోగించుకోవాలని రాష్ట్రాలకు సూచించారు.

Tags:    

Similar News