Dalit Youth to Drink Urine: దళితుడితో బలవంతంగా మూత్రం తాగించిన ఎస్సై

Dalit Youth to Drink Urine: మహిళ ఫోన్‌కాల్‌కు సంబంధించిన వివాదంలో దళిత యువకుడిని స్టేషన్‌కు పిలిపించిన ఎస్సై అతడితో మూత్రం తాగించాడు

Update: 2021-05-24 02:37 GMT

Cop Accused of Forcing Dalit Youth to Drink Urine:(Twitter Image)

Dalit Youth to Drink Urine: సైన్సు ఎంత పెరిగినా.. చదువులు ఎంత చదివినా.. మన భారతదేశాన్ని పట్టి పీడిస్తోన్న కుల మహమ్మారి మాత్రం వదిలిపెట్టడం లేదు. కరోనాకైనా మందు కనిపెట్టగలిగాం గాని.. ఈ కుల కరోనాకు మాత్రం ఎవరూ మందు కనిపెట్టలేకపోతున్నారు. కర్నాటక చిక్ మగుళూరులో జరిగిన ఘటన చూస్తే గుండెలు మండిపోతాయి. కేవలం దళితుడనే కారణంతో పోలీసుల ట్రీట్ మెంట్ మారిపోయింది. ఆ యువకుడు తప్పు చేశాడో లేదో దర్యాప్తులో తేలుతుంది. కాని ఈలోపే అక్కడి ఎస్ఐ మాత్రం ముందే శిక్ష విధించేశాడు.. అది కూడా సభ్యసమాజం తలదించుకునే విధంగా.

మహిళ ఫోన్‌కాల్‌కు సంబంధించిన వివాదంలో దళిత యువకుడిని స్టేషన్‌కు పిలిపించిన ఎస్సై అతడితో మూత్రం తాగించాడు. కర్ణాటకలోని చిక్కమగళూరులో జరిగిన ఈ ఘటనపై సర్వత్ర తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గోనిబీదు ఎస్సై అర్జున్ పోలీస్ స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా మూత్రం తాగించాడని బాధిత యువకుడు ఆరోపించాడు.

ఎస్సై తీరుపై భగ్గుమన్న దళిత సంఘాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాయి. యువకుడితో మూత్రం తాగించిన ఎస్సై అర్జున్‌పై ఎఫ్ఐఆర్ నమోదైందని, అట్రాసిటీ చట్టం కింద తప్పుగా నిర్బంధించడం, బెదిరింపు, అవమానానికి గురిచేయడం, హింసించడం వంటి అభియోగాలు నమోదయ్యాయని పేర్కొన్నారు. అతడిని బదిలీ చేసినట్టు చెప్పారు.

Tags:    

Similar News