E Shram Card: భవన కార్మికులు ఈ శ్రమ్ కార్డుకి అర్హులేనా..? అసలు విషయం ఏంటంటే..?

E Shram Card: భవన కార్మికులు ఈ శ్రమ్ కార్డుకి అర్హులేనా..? అసలు విషయం ఏంటంటే..?

Update: 2022-01-06 02:00 GMT

భవన కార్మికులు ఈ శ్రమ్ కార్డుకి అర్హులేనా..? అసలు విషయం ఏంటంటే..?

E Shram Card: కరోనా మహమ్మారి వల్ల సామన్యుల బతుకులు ఆగమాగం అయ్యాయి. ముఖ్యంగా వలస కూలీలు నానా ఇబ్బందులు పడ్డారు. మరికొంత మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితులను ఎదుర్కొన్నారు. అందుకే ప్రభుత్వం ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరూ బాధపడవద్దని అసంఘటిత రంగ కార్మికుల కోసం ఈ-శ్రమ్ పోర్టల్‌ను ప్రారంభించింది. తద్వారా ఈ వ్యక్తులందరి డేటాబేస్‌ను తయారు చేసి వారికి ఆర్థిక సహాయం అందించవచ్చు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథాకానికి వీరు అర్హులు అవుతారు. ఇప్పటి వరకు 18 కోట్ల మందికి పైగా కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్‌లో చేరారు. కానీ ఇప్పటికి ఈ కార్డుకి ఎవరెవరు అర్హులని చాలామందికి అనుమానాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

అసంఘటిత రంగంలోని చాలా మంది కార్మికులు ఇప్పటి వరకు ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. వారికి ఈ పథకం అర్హత గురించి తెలియదు. అందువల్ల కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ అధికారిక ట్వీట్ హ్యాండిల్ ద్వారా ప్రజలకు నిరంతరం సమాచారం అందిస్తున్నారు. ఒక వ్యక్తి 'నేను భవన నిర్మాణ కార్మికుడిని కాబట్టి నేను ఈ-శ్రమ్ కార్డ్ పొందవచ్చా అని ట్వీట్ చేశాడు' దానికి ప్రతిస్పందనగా భవన నిర్మాణ కార్మికులు, వలస కార్మికులు, వీధి వ్యాపారులు, గృహ కార్మికులు, వ్యవసాయ కార్మికులు ESIC లేదా EPFO ​​లో సభ్యులు కాని ఇతర కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చని బదులిచ్చారు.

ఇంటి ఆధారిత పని చేసే లేదా అసంఘటిత రంగంలో పని చేసే జీతం పొందే ఏ కార్మికుడైనా ఇందులో చేరవచ్చు. ఇది కాకుండా ESIC లేదా EPFO ​​ఉద్యోగి కాని కార్మికుడిని అసంఘటిత కార్మికుడు అంటారు. అదే సమయంలో ఈ వ్యక్తులు ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చు. వీరిలో చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులు, మత్స్యకారులు, లేబులింగ్, ప్యాకేజింగ్, భవనం, నిర్మాణ కార్మికులు, తోలు కార్మికులు, వడ్రంగులు, గృహ కార్మికులు, బార్బర్లు, కూరగాయలు, పండ్ల విక్రేతలు, వార్తాపత్రికల విక్రేతలు, రిక్షా పుల్లర్లు, CSC సెంటర్ డ్రైవర్లు, MNREGA ఉన్నవారు అందరు ఇందులో చేరవచ్చు. 

Tags:    

Similar News