Congress: రాజీవ్ హత్య కేసు నిందితుల విడుదలపై సుప్రీంకోర్టుకు కాంగ్రెస్..
Rajiv Assassination Case: రాజీవ్‌హత్య కేసులో దోషుల విడుదలపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
Congress: రాజీవ్ హత్య కేసు నిందితుల విడుదలపై సుప్రీంకోర్టుకు కాంగ్రెస్..
Rajiv Assassination Case: రాజీవ్‌హత్య కేసులో దోషుల విడుదలపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దేశ మాజీ ప్రధాని హత్యకు పాల్పడిన దోషులకు శిక్ష తగ్గించి, జైలు నుంచి విడుదల చేయడాన్ని ఆపార్టీ అధిష్టానం తీవ్రంగా తప్పుబడుతోంది. ఈ కేసులో దోషుల విడుదలపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్న ఆపార్టీ వర్గాలు కోర్టు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని రివ్యూ పిటిషన్దాఖలు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నాయి. ఈ మేరకు త్వరలో రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే ఈ కేసులో దోషుల విడుదలపై కాంగ్రెస్‌నుంచి వస్తున్న విమర్శలతో ఇటీవల కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దోషుల విడుదల నిర్ణయాన్ని పున: సమీక్షించాలని కోరింది. ఈ నెల 11న రాజీవ్ హత్య కేసులో జీవితఖైతు శిక్ష అనుభవిస్తున్న నళిని శ్రీహరన్ సహా మొత్తం ఆరుగురు దోషులు రవిచంద్రన్, సంథన్, రాబర్ట్ పాయస్, జయ కుమార్ లను విడుదల చేస్తూ తీర్పునిచ్చింది. జైలులో దోషుల ప్రవర్తన సంతృప్తికరంగా ఉన్నందున శిక్ష తగ్గించాలంటూ నిర్ణయించిన కోర్టు దోషుల విడుదల చేయడంలో తమిళనాడు ప్రభుత్వం సిఫార్సులను కూడా పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.