Rahul Gandhi: మోదీజీ.. నా ప్రేమ, మద్దతు మీకు ఉంటాయి

Rahul Gandhi: హీరాబెన్ త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ ట్వీట్

Update: 2022-12-29 01:29 GMT

Rahul Gandhi: మోదీజీ.. నా ప్రేమ, మద్దతు మీకు ఉంటాయి

Rahul Gandhi: ప్రధాని మోడీ తల్లి హీరాబెన్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను అహ్మదాబాద్‌లోని UN మెహతా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అయితే అనారోగ్యానికి గల కారణాలను మాత్రం వారు వెల్లడించలేదు. మరోవైపు ఈ బాధాకరమైన సమయంలో ప్రధాని మోదీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అండగా నిలిచారు. తల్లీ కొడుకుల మధ్య అనుబంధం అన్నిటికీ అతీతమైనదని, వెలకట్టలేనిదని... మోదీ గారూ, ఈ కష్ట సమయంలో మీకు నా ప్రేమ, మద్దతు వుంటాయని ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. మీ మాతృమూర్తి త్వరగా కోలుకుంటారని ఆకాంక్షిస్తున్నానని ట్వీట్ చేశారు.

Tags:    

Similar News