Salman Khurshid: ఖర్గే అధ్యక్షుడైనా.. గాంధీ కుటుంబమే లీడర్
Salman Khurshid: కాంగ్రెస్‌ను నడిపించేది గాంధీ కుటుంబీకులే
Salman Khurshid: ఖర్గే అధ్యక్షుడైనా.. గాంధీ కుటుంబమే లీడర్
Salman Khurshid: కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ మరోసారి నోరు జారారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేవలం పార్టీని నడుపుతారని, గాంధీ కుటుంబం చేతిలోనే నాయకత్వం ఉంటుందని హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ గాంధీ కుటుంబీకులే నేతృత్వం వహిస్తున్నారని స్పష్టం చేశారు. తమ పార్టీలో చాలా మంది నేతలున్నా కీలక నేతలు మాత్రం గాంధీ కుటుంబీకులేనని చెప్పారు. ఖర్గే జీ తమ జాతీయ అధ్యక్షుడని, పార్టీని సంస్ధాగతంగా పటిష్టం చేయడంలో మల్లికార్జున్ ఖర్గే కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు.