బాబ్రీ పరిష్కారంపై రాజీవ్‌ ఆసక్తి చూపించలేదు

Update: 2019-11-05 12:09 GMT

అయోధ్య రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో 40 రోజులుగా రోజువారి విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం ఈ నెల 17న కీలక తీర్పు వెలువరించనుంది. ఈ నేపధ్యంలో అయోధ్య అంశంసై ఎలాంటి వివాదాస్పద వాఖ్యలు చేయకుడదని, టీవీ చర్చ కార్యక్రమాల్లో కూడా ఈ అంశంపై ప్రస్తావించకుడదని పేర్కొన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హోం శాఖ మాజీ కార్యదర్శి మాధవ్‌ రాసిన ఓ పుస్తకంలో మసీదులో పూజలకు అనుమతించిన జిల్లా జడ్జిని అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీని కరసేవకులుగా వర్ణించిన విషయం గుర్తు చేశారు. మాధవ్‌ గోడ్బోలే వ్యాఖ్యలే సాక్షాలని తెలిపారు. బాబ్రీ మసీదుకు తాళాలు తీసిన వ్యక్తి రాజీవ్ గాంధీని అని ఆరోపించారు.

అప్పటి ఎంపీలు షాబుద్దీన్‌, మంత్రి కరణ్‌ సింగ్‌లు ఇచ్చిన సూచనలు రాజీవ్ గాంధీ పట్టించుకోలేదని మాధవ్‌ గోడ్బోలే వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయోధ్య వివాదం పరిష్కారం పట్ల రాజీవ్ చోరవ చూపలేదని అసదుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News