Punjab: సీఎం అమరీందర్ సింగ్, పీసీసీ చీఫ్ సిద్ధు మధ్య వివాదం

Punjab: పంజాబ్‌లో కాంగ్రెస్‌లో రాజకీయం వేడెక్కింది. అమరీందర్ సింగ్, పీసీసీ చీఫ్ సిద్ధు మధ్య వివాదం తారాస్థాయికి చేరింది.

Update: 2021-09-18 07:03 GMT

అమరిందర్ సింధ్ మరియు సింధు మధ్య వివాదం (ఫైల్ ఇమేజ్)

Punjab: పంజాబ్‌లో కాంగ్రెస్‌లో రాజకీయం వేడెక్కింది. సీఎం అమరీందర్ సింగ్, పీసీసీ చీఫ్ సిద్ధు మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య వివాదం ముదురుతోంది. దీంతో సీఎం పదవికి అమరీందర్ సింగ్ రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ క్షణమైనా గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖ అందించే అవకాశం కనిపిస్తోంది.

పీసీసీ చీఫ్‌గా ఉన్న సిద్ధూ అమరీందర్ ప్రభుత్వంపై గతకొంతకాలంగా విమర్శలు గుప్పిస్తున్నాడు. ప్రభుత్వం సరిగ్గా పనిచేయడంలేదని ఆరోపణలు చేస్తున్నాడు. ముఖ్యంగా చెరకు రైతులకు మద్దతు ధర లభించడంలేదని గళమెత్తుతున్నాడు. సొంత పార్టీలోనే సిద్ధూ ప్రతిపక్షంగా మారడంతో సీఎం అమరీందర్ సింగ్‌కు తలనొప్పిగా మారాడు. 

Full View


Tags:    

Similar News