Coronavirus: భారత్ లో భారీగా పెరిగిన రికవరీ రేటు
భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి.
భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా ధృవీకరించబడిన కరోనా సంఖ్య 20,000 కి చేరుకుంది, మరణాల సంఖ్య 600 పైగా నమోదయింది. కేసులు పెరుగుతున్నా రికవరీ రేటు 17.5 శాతానికి పెరిగిందని.. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 705 మంది రోగులు నయమై డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. మొత్తంమీద, ఇప్పటివరకు 3,800 మందికి పైగా డిశ్చార్జ్ అయ్యారు.
మరణాలు , రికవరీలు పోను దేశంలో ఇప్పుడు 15 వేలకు పైగా క్రియాశీల కేసులు ఉన్నాయి, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన గణాంకాల ప్రకారం. ఇక కోవిడ్ -19 సంక్రమణకు సంబంధించి మొత్తం 4,49,810 నమూనాలను మంగళవారం వరకు పరీక్షించామని, అందులో సోమవారం 35,852 పరీక్షలు జరిగాయని ఐసిఎంఆర్ శాస్త్రవేత్త తెలిపారు. ఐసిఎంఆర్ నెట్‌వర్క్ పరిధిలోని 201 ల్యాబ్‌లలో 29,776 నమూనాలను, 86 ప్రైవేట్ ప్రయోగశాలలలో 6,076 నమూనాలను పరీక్షించారు.