ఢిల్లీలో 23వ రోజు కొనసాగుతున్న రైతుల ఆందోళనలు

మధ్యాహ్నం 2 గంటలకు రైతుల ఆందోళనలనుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగింనున్నారు. మధ్యప్రదేశ్‌ పర్యటనలో ఉన్న మోడీ.. అక్కడి నుంచే రైతులతో మాట్లాడనున్నారు. రైతు చట్టాల గురించి, వాటి ప్రయోజనాల గురించి వివరించనున్నారు.

Update: 2020-12-18 07:00 GMT

ఢిల్లీ సరిహద్దుల్లో 23వ రోజు రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తక్షణమే వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఇప్పటికే పలుమార్లు కేంద్రం, రైతు సంఘాల మధ్య చర్చలు జరిగినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం. మరోవైపు కేంద్రం మరోసారి చర్చలకు పిలిచినా.. చట్టాలు రద్దయ్యేంతవరకు ఎలాంటి చర్చలకు రాబోమని తేల్చి చెప్పారు రైతు సంఘాల ప్రతినిధులు.

మధ్యాహ్నం 2 గంటలకు రైతుల ఆందోళనలనుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగింనున్నారు. మధ్యప్రదేశ్‌ పర్యటనలో ఉన్న మోడీ.. అక్కడి నుంచే రైతులతో మాట్లాడనున్నారు. రైతు చట్టాల గురించి, వాటి ప్రయోజనాల గురించి వివరించనున్నారు. ప్రధాని ప్రసంగాన్ని 23 వేల గ్రామాల్లో ప్రత్యక్ష ప్రసారం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అనంతరం మధ్యప్రదేశ్‌లోని 25 లక్షల మంది రైతుల ఖాతాల్లో పంట నష్టం కింద ఒక వేయి 660 కోట్లను జమ చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News