Ladakh: లఢఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలంటూ రోడ్డెక్కిన స్థానికులు

Ladakh: గిరిజన రాష్ట్రంగా గుర్తింపు, స్థానికులకు ఉద్యోగ రిజర్వేషన్లు

Update: 2024-02-04 15:45 GMT

Ladakh: లఢఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలంటూ రోడ్డెక్కిన స్థానికులు 

Ladakh: జమ్మూకశ్మీర్‌ నుంచి విభజిత ప్రాంతమైన లఢఖ్‌లో ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. ఆదివారం చేపట్టిన బంద్‌ విజయవంతం అయింది. లఢఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలంటూ స్థానికులు రోడ్డెక్కారు. లడఖ్‌కు రాష్ట్ర హోదా డిమాండ్‌తోపాటు మరో మూడు ప్రధాన డిమాండ్లను కూడా నిరసనకారులు వినిపిస్తున్నారు. గిరిజన రాష్ట్రంగా గుర్తింపు, స్థానికులకు ఉద్యోగ రిజర్వేషన్లు, లడఖ్‌-కార్గిల్‌లకు ఒక్కో పార్లమెంటరీ సీటు కేటాయింపు అనే డిమాండ్‌లను నిరసకారులు లేవనెత్తుతున్నారు.

ఈ క్రమంలో నిరసనకారులు ఆదివారం లఢఖ్ అంతటా బంద్‌కు పిలుపునిచ్చారు. శనివారం లడఖ్‌లోని లేహ్ జిల్లాలో భారీ నిరసన ర్యాలీలు చేశారు. లేహ్ అపెక్స్ బాడీ, కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ బంద్‌కు పిలుపునిచ్చింది. లడఖ్‌కు రాష్ట్ర హోదా, గిరిజన హోదాను డిమాండ్ చేస్తూ జనవరి 23న కేంద్ర హోంశాఖకు మెమోరాండం కూడా సమర్పించారు. జమ్మూ కాశ్మీర్‌లో భాగంగా ఉన్నప్పుడు తమకు అసెంబ్లీలో నలుగురు, శాసన మండలిలో ఇద్దరు సభ్యులు ఉన్నారు. ఇప్పుడు తమకు అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేదని అక్కడి నేతలు అంటున్నారు.

Tags:    

Similar News