Odisha: ప్రియుడిని నిర్బంధించి.. యువతిపై 10 మంది గ్యాంగ్‌రేప్‌..!!

Odisha: బీజేపీ పాలిత ఒడిశాలో మహిళలకు రక్షణ కరువయ్యింది.

Update: 2025-06-18 02:54 GMT

Odisha: ప్రియుడిని నిర్బంధించి.. యువతిపై 10 మంది గ్యాంగ్‌రేప్‌..!!

Odisha: బీజేపీ పాలిత ఒడిశాలో మహిళలకు రక్షణ కరువయ్యింది. ఆదివారం బాయ్ ఫ్రెండ్ తో సరదాగా బీచ్ కు వెళ్లిన 20ఏళ్ల యువతిపై కొంతమంది సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. గోపాల్ పూర్ బీచ్ లో చోటుచేసుకున్న ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న బాధితురాలు, ఆదివారం రాజా ఫెస్టివల్ ను పురస్కరించుకుని తన బాయ్ ఫ్రెండ్ తో బీచ్ కు వెళ్లింది. అక్కడ పదిమందితో కూడిన ఓ గుంపు వారిని చుట్టుముట్టి ,నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లింది. బాయ్ ఫ్రెండ్ ను నిర్బంధించి యువతిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు విచారణలో వెల్లడయ్యింది.

ఈ కేసులో మొత్తం 10 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు బెర్హాంపూర్ జిల్లా ఎస్పీ సరవణ వివేక్ తెలిపారు. నిందితుల్లో నలుగురు మైనర్లు ఉన్నారని..అత్యంత హేయమైన నేరానికి పాల్పడ్డ మైనర్లు పెద్దలుగానే పరిగణించాలని కోర్టును కోరనున్నట్లు తెలిపారు. నిత్యం ఎంతో మంది సందర్శించే బీచ్ రిసార్ట్ టౌన్ గోపాల్ పూర్ లో సామూహిక లైంగిక దాడి ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబుకుతుంది. ఘటనపై సమగ్రమైన దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఘటనను ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తీవ్రంగా ఖండించారు. మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరంగా దీన్ని అభివర్ణించారు. కేసును జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. మూడు రోజుల్లోగా యాక్షన్ రిపోర్ట్ ను సమర్పించాలంటూ ఒడిశా డీజీపీని ఎన్ సీడబ్ల్యూ చైర్ పర్సన్ విజయ రాహత్కర్ ఆదేశించారు.

Tags:    

Similar News