ఇవాళ ఎన్డీఏ కూటమిలోకి సీఎం నితీష్ కుమార్
Nitish Kumar: ఉ.10 గం.కు పాట్నాలో ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశం
ఇవాళ ఎన్డీఏ కూటమిలోకి సీఎం నితీష్ కుమార్
Nitish Kumar: బిహార్‌లో పాలిటిక్స్ ట్విస్టుల మధ్య కొనసాగుతున్నాయి. గత కొన్నిరోజులుగా నెలకొన్న రాజకీయ సంక్షోభానికి ఇవాళ్టితో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ ఎన్డీయే కూటమిలోకి బీహార్ సీఎం నితీష్ కుమార్ చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఆర్జేడీ, కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్‌కు నితీష్ కుమార్ గుడ్‌బై చెప్పనున్నారు. ఉదయం 10 గంటలకు నితీష్ సారథ్యంలో పాట్నాలో ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ భేటీకి బీజేపీ, జేడీయూ, జితిన్‌రాం మాంఝీ సారథ్యంలోని హిందుస్తాన్ అవామీ లీగ్ పార్టీ నేతలు హాజరుకానున్నారు.
ఎమ్మెల్యేలంతా కలిసి శాసనసభాపక్ష నేతగా నితీష్‌ను ఎన్నుకుంటారు. అనంతరం గవర్నర్‌ను కలిసి సీఎం పదవికి రాజీనామా సమర్పించనున్నారు నితీష్. అనంతరం ఎన్డీఏ పక్షాల మద్దతు లేఖలు సమర్పించి.. మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు సీఎంగా మళ్లీ ప్రమాణం చేయనున్నారు నితీష్.