Nitish Kumar: రేపు బిహార్ అసెంబ్లీలో నితీష్‌కుమార్ బలపరీక్ష
Nitish Kumar: సీఎం నితీష్ విందుకు 10మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు
Nitish Kumar: రేపు బిహార్ అసెంబ్లీలో నితీష్‌కుమార్ బలపరీక్ష
Nitish Kumar: రేపు బిహార్ అసెంబ్లీలో నితీష్‌కుమార్ బలపరీక్ష ఉండనుంది. ఈ నేపథ్యంలోనే బలపరీక్షకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. బలపరీక్ష నేపథ్యంలో బిహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు హైదరాబాద్‌లో క్యాంపు ఏర్పాటు చేశారు. దాదాపు వారం రోజులుగా బిహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. బలపరీక్ష నేపథ్యంలో.. ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాట్నా వెళ్లనున్నారు.
ఇటు సీఎం నితీష్ విందుకు 10మంది ఎమ్మెల్యేలు గైర్హాజరైనట్లు తెలుస్తోంది. దీంతో బలపరీక్షపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరో వైపు బిహార్‌లో తేజస్వీ యాదవ్ ఇంట్లోనే ఆర్జేడీ ఎమ్మెల్యేలకు వసతి ఏర్పాటు చేశారు. రేపటి వరకు ఎమ్మెల్యేలంతా తేజస్వీ యాదవ్ ఇంట్లోనే ఉండనున్నారు.