Delhi Unlock: ఢిల్లీలో అన్‌లాక్ 3.0

Delhi Unlock: మరిన్ని సడలింపులు ప్రకటించిన సీఎం కేజ్రీవాల్

Update: 2021-06-13 09:24 GMT

సీఎం కేజ్రీవాల్ (ఫైల్ ఇమేజ్)

Delhi Unlock: కరోనా సెకండ్ వేవ్‌తో విలవిలలాడిన ఢిల్లీ.. ప్రస్తుతం కోలుకుంటుంది. వైరస్ ప్రభావంతో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. మే నెలాఖరులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్‌లాక్ ప్రారంభించారు. అందులో భాగంగా ఇప్పటికే పలు ఆంక్షలు ఎత్తివేయగా.. ఇప్పుడు మరిన్ని సడలింపులు ఇచ్చారు. అన్ని దుకాణాలు, మాల్స్ తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. 50శాతం సిటింగ్ సామర్థ్యంతో రెస్తారెంట్లను నిర్వహించుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు.

స్కూల్స్, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు మూసేవేయాలని తెలిపారు. సామాజిక, రాజకీయ, క్రీడలు, వినోదం, మతపరమైన పండుగలపై ఆంక్షలు కొనసాగనున్నాయి. మరోవైపు.. వారం రోజులు పరిస్థితిని పరిశీలిస్తామని, కేసులు పెరిగితే కఠిన ఆంక్షలు తప్పవని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రూప్ -ఏ అధికారులు వందశాతం, మిగతా గ్రూపుల్లో 50శాతం సిబ్బంది విధులకు హాజరు కానున్నారని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ప్రైవేట్ కార్యాలయాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 50శాతం సిబ్బందితో నిర్వహించుకోవచ్చని స్పష్టం చేశారు.

Tags:    

Similar News