AP Telangana Water Issue: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై షెకావత్‌కు కేసీఆర్ ఫిర్యాదు
AP Telangana Water Issue: ఏపీ-తెలంగాణ నీటి వివాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌కు ఫిర్యాదు చేశారు.
CM KCR, Union Minister Shekhawat:(The Hans India)
AP Telangana Water Issue: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, ఆర్డీఎస్ వల్ల తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌కు ఫిర్యాదు చేశారు. ఇరురాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూస్తానని, రాయలసీమ ప్రాజెక్టు పనులను పరిశీలించి వారంలో నివేదిక ఇవ్వాలని కేఆర్ఎంబీకి కేంద్రమంత్రి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి ఆమోదం లేకుండా ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘించి రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేపడుతోందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
అయితే, నీటి ప్రాజెక్టుల విషయంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ రంగంలోకి దిగారు. అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు చేపడితే తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి చెప్పినట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ అక్రమంగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నిలిపేయడానికి తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టాలని తెలంగాణ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు పలు మార్లు విజ్ఞప్తి చేసింది.
జాతీయ హరిత ట్రైబ్యునల్ నిర్ణయానికి విరుద్ధంగా పనులు కొనసాగిస్తోందంటూ ఫొటోలను కూడా జత చేసింది. ఎన్జీటీ ఆదేశాలను అమలు చేయడంలో బోర్డు విఫలమైందని పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ మంగళవారం కృష్ణా బోర్డు ఛైర్మన్‌కు లేఖ రాశారు.