Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్
Himachal Pradesh: వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్న రాష్ట్రంలోని నదులు
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. కులులోని నిర్మంద్ బ్లాక్, మాలానా, మండి, సిమ్లా జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా కుండపోత వర్షం కురిసింది. వర్షాలకు రాష్ట్రంలోని పలు నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇక సిమ్లా జిల్లాలోని రాంపూర్ ప్రాంతంలో ఓ భారీ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. అనంతరం పార్వతీ నదిలో కొట్టుకుపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. కాగా, క్లౌడ్ బరస్ట్ కారణంగా మూడు ప్రాంతాల్లో దాదాపు 36 మంది గల్లంతయ్యారు. మండిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. వర్ష బీభత్సంపై హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సమీక్ష నిర్వహించారు. జిల్లా అధికారులకు సూచనలు చేసినట్లు తెలిపారు.