CJI Ramana: పార్లమెంట్‌లో చేసే చట్టాలపై సీజేఐ సంచలన వ్యాఖ్యలు

CJI Ramana: చట్టాలపై చర్చ జరగకపోవడంపై జస్టిస్ ఎన్వీ రమణ అసహనం

Update: 2021-08-15 08:03 GMT
సుప్రీమ్ కోర్ట్ జస్టిస్ రమణ (ఫైల్ ఇమేజ్)

CJI Ramana: పార్లమెంట్‌లో చేసే చట్టాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ. చట్టాలపై చర్చ జరగకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతంలో పార్లమెంటు చర్చలు నిర్మాణాత్మకమైనవిగా ఉండేవని, ప్రస్తుతం చట్టాలపై ఉభయసభల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసని అన్నారు. గతంలో చట్టాలు చేసేటప్పుడు కోర్టులపై భారం తక్కువగా ఉండేదని చెప్పారు. నిర్దిష్ట చట్టాన్ని రూపొందించడం వెనుక ఉద్దేశం ఏంటో, శాసనసభ ఏమనుకుంటుందో తమకు స్పష్టత ఉండేదన్నారు సీజేఐ. కానీ ఇప్పుడు చట్టాల్లో చాలా సందిగ్ధతలున్నాయని అసంతృప్తి వ్యక్త పరిచారు. కొత్త చట్టాల అసలు ఉద్దేశం ఏంటో తెలియకుండా పోతోందని, నాణ్యమైన చర్చ లేకపోవడంతో న్యాయపరమైన చిక్కులు ఏర్పడతాయని అభిప్రాయపడ్డారు సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ.

Tags:    

Similar News