Supreme Court: 9 మంది జడ్జీల నియామకానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్

Supreme Court: * 9 మంది పేర్లను రాష్ట్రపతికి పంపిన ప్రభుత్వం * అధికారిక అనుమతి రాగానే ప్రమాణస్వీకారం

Update: 2021-08-26 04:03 GMT

9 మంది జడ్జీల నియామకానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్

Supreme Court: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో నూతన జడ్జీల నియామకానికి సంబంధించి కొలీజియం చేసిన సిఫార్సుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం ఇటీవల తొమ్మిదిమంది పేర్లను ప్రభుత్వానికి పంపింది. ఈ పేర్లను పరిశీలించిన కేంద్రం తాజాగా వారి నియామకానికి అనుమతినిచ్చింది. వారి పేర్లను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు పంపింది. ఆయన నుంచి అధికారిక ఆమోదం లభించిన వెంటనే వీరంతా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు.

సుప్రీంకోర్టు కొలీజియం ప్రభుత్వానికి సిఫార్సు చేసిన పేర్లలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు కూడా ఉన్నారు. వీరిలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జిస్టిస్ బీవీ నాగరత్న ఒకరు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యే అవకాశాలు ఆమెకు పుష్కలంగా ఉన్నాయి. అదే జరిగితే భారతదేశ న్యాయ చరిత్రలో చీఫ్ జస్టిస్ అయిన తొలి మహిళగా జస్టిస్ నాగరత్న రికార్డులకెక్కుతారు.

Tags:    

Similar News