Chiranjeevi: చిరంజీవి జపం చేస్తున్న మోడీ.. అసలు కారణం అదేనా..?
ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగంలో చిరంజీవి పేరును ప్రస్తావించారు. వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ అడ్వైజరీ బోర్డు ప్రసంగంలో చిరంజీవి భారతీయ సినీ రంగంలో ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.
చిరంజీవి జపం చేస్తున్న మోడీ.. అసలు కారణం అదేనా..?
Chiranjeevi: ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగంలో చిరంజీవి పేరును ప్రస్తావించారు. వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ అడ్వైజరీ బోర్డు ప్రసంగంలో చిరంజీవి భారతీయ సినీ రంగంలో ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన వీడియోను చిరంజీవి ఎక్స్‌లో పోస్టు చేశారు. వేవ్‌స్ అడ్వైజరీ బోర్డు ప్రసంగంలో ఇతరుల ముందు తన పేరు ప్రస్తావించడం పట్ల చిరంజీవి ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.
మోడీ వేవ్‌స్ దేశాన్ని ముందుకు నడిపిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. మోదీ కొత్త ఆలోచనలతో సాఫ్ట్ పవర్ ప్రపంచపు శిఖరాలను దేశం త్వరలోనే చేరుకుంటుందని ఆకాంక్షించారు. భారతదేశంలోని పలు ఇండస్ట్రీలోని ప్రముఖులందరితోనూ ప్రధాని మోడీ భేటీ అయ్యారు. స్టార్ హీరోలందరితోనూ జూమ్ మీటింగ్‌లో మాట్లాడి వారి సలహాలు, సూచనలు కూడా తీసుకున్నారు. ఈ భేటీలో టాలీవుడ్ నుంచి చిరంజీవి, నాగార్జున పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి ట్వీట్ వైరల్‌గా మారింది. గతంలోనూ మోడీ.. చిరంజీవి పట్ల అభిమానం చూపించారు. చంద్రబాబు నాయుడు రెండో సారి ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సభలోనూ చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను మోడీ ప్రశంసించారు. చిరంజీవి పట్ల తరచూ మోదీ అభిమానం చూపిస్తున్న నేపథ్యంలో ఆయనకు త్వరలో కేంద్రమంత్రి పదవి వస్తుందని ప్రచారం సాగుతోంది. జనసేన పార్టీ నుంచి రాజ్యసభకు పంపడం ద్వారా మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవచ్చన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ వార్తల్లో వాస్తవం ఎంత ఉందనేది తెలియాలంటే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే.
ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. వాటితో పాటు, బాబీ, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, మారుతి సినిమాలు లైన్‌లో ఉన్నాయి.