లద్దాఖ్‌లో చైనా సైనికుడి అరెస్ట్‌

Update: 2020-10-19 10:26 GMT

లడఖ్‌లోని చుమర్-డెమ్‌చోక్ ప్రాంతంలో చైనా సైనికుడిని భారత సైన్యం అరెస్టు చేసింది. అతను అనుకోకుండా భారత సరిహద్దులోకి ప్రవేశించి ఉండవచ్చని ఆర్మీ అధికారులు భావిస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఈ సైనికుడిని చైనా సైన్యానికి తిరిగి అప్పగిస్తారు. చైనా సైనికుడి వ‌ద్ద సివిల్‌, మిలిట‌రీ డాక్యుమెంట్లు ఉన్న‌ట్లు భార‌త అధికారులు గుర్తించారు. ఇదిలావుంటే నిరంతర ఉద్రిక్తతల మధ్య, భారత సైన్యం శీతాకాలంలో లడఖ్ యొక్క ఎత్తైన ప్రదేశాలలో పట్టు సాధించడానికి సన్నాహాలు చేసింది.

ఇందుకోసం యుఎస్ నుండి వార్ఫేర్ కిట్లు అలాగే శీతాకాలపు దుస్తులను కొనుగోలు చేసింది. భారత దళాలు లడఖ్‌లోని పంగోంగ్ సరస్సుకి దక్షిణంగా ఉన్న 13 ముఖ్యమైన శిఖరాలను ఆక్రమించాయి.. కాగా అక్టోబర్ 12 న, సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడానికి చుషుల్‌లో కార్ప్స్ కమాండర్ స్థాయి సమావేశం దాదాపు 11 గంటలపాటు జరిగింది, కాని అంతకుముందు సమావేశాల మాదిరిగానే ఇది కూడా విఫలమైంది. 

Tags:    

Similar News